
కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్శిటీలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల సమస్యలతోపాటు యూనివర్శిటీ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ AISF ఆధ్వర్యంలో చలో యూనివర్శిటీ కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులు. విద్యార్థులును అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసులు.. విద్యార్ధులను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఎంత మందిని అరెస్టు చేసినా యూనివర్శిటీ ముట్టడి చేసి తీరుతామని స్పష్టం చేశారు విద్యార్థులు. అక్రమ అరెస్టులు తమను ఏమీ చేయలేవన్నారు.
యూనివర్శిటీ ఎదుట బైఠాయించిన విద్యార్థులకు వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు సూచించారు. అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చేంత వరకు వెనుదిరిగేది లేదని తేల్చి చెప్పారు విద్యార్థులు.