
ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌కి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. నాసిక్‌లోని ఓ భూమికి ఆమె పన్ను చెల్లించకపోవడంతో ఈ నోటీసులు జారీ చేశారు. ఏడాది నుంచి ఐశ్వర్య రాయ్ భూములకు సంబంధించిన పన్నులు చెల్లించడం లేదని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. నాసిక్ సిన్నార్‌లోని అవడీ ప్రాంతంలో ఐశ్యర్య రాయ్‌కు భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఏడాదికి రూ.21,960 చెల్లించాల్సి ఉంది. ఐశ్యర్యకు దాదాపు హెక్టార్ భూమి ఉందని సమాచారం. నోటీసులు అందిన 10 రోజులలోపు బకాయిలు చెల్లించకపోతే, మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం, 1966లోని సెక్షన్ 174 ప్రకారం ఐశ్వర్యపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
ఐశ్వర్యరాయ్ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ లో నటించింది. కార్తీ, విక్రమ్, జయం రవి, త్రిష,ఐశ్వర్య లక్ష్మి కూడా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని సీక్వెల్ గా పొన్నియిన్ సెల్వన్: II ఏప్రిల్ 2023లో విడుదల కానుంది.