డ్రైవర్ జమునగా ఐశ్వర్య రాజేష్

డ్రైవర్ జమునగా ఐశ్వర్య రాజేష్

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్  ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘డ్రైవర్ జమున’. పి. క్లిన్ సిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.  నిర్మాత సురేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది. ఇంట్లో పెద్దవాళ్ళ మాట కాదని జమున(ఐశ్వర్య రాజేష్) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటుంది. మరోపక్క ఒక రౌడీ బ్యాచ్ ఒక రాజకీయ నేతను హత్య చేయడానికి పథకం వేస్తారు. అనుకోకుండా ఆ రౌడీ బ్యాచ్.. జమున క్యాబ్ లో ఎక్కుతారు.. 90 నిమిషాల ఆ ప్రయాణంలో జమున ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది..? ఆ హత్య కేసు నుంచి జమున ఎలా బయటపడింది..? రాజకీయ నేతను కాపాడడానికి ఆమె ఏమేమి ప్రయత్నాలు చేసింది..? అనేది స్టోరీగా తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం చాలా థ్రిల్లింగ్ గా కట్ చేశారు. క్యాబ్ డ్రైవర్ గా ఐశ్వర్య నటన అద్భుతమంటున్నరు. సినిమాకు హైలైట్ గా నిలిచింది జిబ్రాన్ మ్యూజిక్.. ఈ ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. తెలుగు, తమిళ్ భాషల్లో 18 రీల్స్ బ్యానర్ పై ఎస్పీ చౌదరీ నిర్మించారు.