అంబులెన్సుల్లో ఎన్నికల డబ్బులు తరలిస్తున్నరు : అజయ్​ ఘోష్ ఆరోపణలు​

అంబులెన్సుల్లో ఎన్నికల డబ్బులు తరలిస్తున్నరు : అజయ్​ ఘోష్ ఆరోపణలు​
  • అంబులెన్సుల్లో డబ్బులు తరలిస్తున్నరు
  • అజయ్​ ఘోష్ ఆరోపణలు​

హైదరాబాద్​, వెలుగు : అంబులెన్సులను బీఆర్​ఎస్​ ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నదని, వాటిలో డబ్బులను తరలిస్తున్నదని సీడబ్ల్యూసీ మెంబర్, తెలంగాణ కమ్యూనికేషన్స్​ ఇన్​చార్జి అజయ్​ కుమార్​ ఘోష్​ ఆరోపించారు. గాంధీభవన్​లో  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబులెన్సుల్లో పేషెంట్లు లేరని, 400 కిలోమీటర్లు అంబులెన్సులు వట్టిగనే ట్రావెల్​ చేశాయా అని ప్రశ్నించారు. 

ములుగులో బయలుదేరిన అంబులెన్సులు రాయగిరి టోల్​ ప్లాజాకు రాగానే మాయమైపోయాయని తెలిపారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అంబులెన్సుల్లో మద్యాన్ని సరఫరా చేస్తున్నారని చెప్పారు. ధరణి పోర్టల్​ను కోట్ల సంపాదనకు వాడుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్​ 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.