కాశ్మీర్ టైమ్స్ ఆఫీస్‎లో సోదాలు.. ఏకే47 తూటాలు స్వాధీనం 

కాశ్మీర్ టైమ్స్ ఆఫీస్‎లో సోదాలు.. ఏకే47 తూటాలు స్వాధీనం 

జమ్మూకాశ్మీర్​ లో మీడియా సంస్థ ఆఫీసులో తూటాల దొరకడం కలకలం రేపుతోంది.. గురువారం ( నవంబర్​ 20) జమ్మూలోని కాశ్మీర్​ టైమ్స్​ పత్రికా ఆఫీసులో కాశ్మీర్​ స్టేట్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ సోదాలు నిర్వహించగా ఏకే 47 తూటాలు లభ్యమయ్యాయి. క్యాడ్రిడ్జ్​లు, పిస్టల్​ రౌండ్స్​, మూడు గ్రేనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కశ్మీర్ టైమ్స్​ ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​ అనురాధ భాసిన్​ పై కేసు నమోదు చేశారు. 

దేశానికి వ్యతిరేకంగా, జమ్మూకాశ్మీర్​ కేంద్ర పాలిత ప్రాంతాల వేర్పాటు వాద సమాచారాన్ని చేరవేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. 
కశ్మీర్ టైమ్స్​ ను వేగ్​ భాసిన్​ 1952లో స్థాపించారు. 1964 వరకు వీక్లీ గా వున్న ఈ పత్రిక ఆ తర్వాత డైలీగా మారింది.