టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ టీవీ నటి ఆకాంక్ష చమోలా, నటుడు గౌరవ్ ఖన్నా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రారంభమైన రియాలిటీ షో లాక్ అప్ 2 ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఆకాంక్ష ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. గతేడాది నుంచే తాము విడిగా ఉంటున్నామని తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది.
షో హోస్ట్స్ ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ షోలో తన సీక్రెట్‌ను చెప్పమని అడగగా, ‘‘నేను, గౌరవ్ విడాకులు తీసుకోబోతున్నాం. గత ఏడాది నుంచి మేము విడివిడిగా ఉంటున్నాం. ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటివరకు ఈ విషయాన్ని పబ్లిక్ చేయలేదు" అని చెప్పింది. ఈ ప్రకటనతో ప్రేక్షకులతో పాటు షో హోస్ట్స్ ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
Akanksha Chamola confirms her divorce with Gaurav Khanna on Lock Upp😱#lockupp2 #lockupp #GauravKhanna pic.twitter.com/Sqo81Qq0Hw
— 𝐌•✰ (@24X7BiggBoss) June 27, 2026
అయితే ఇది పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేదా ద్వేషం లేదని ఆకాంక్ష స్పష్టం చేసింది. ‘‘మేమిద్దరం జీవితంలో వేర్వేరు భవిష్యత్తులను కోరుకుంటున్నాం. భార్యాభర్తలుగా మేము అనుకూలంగా లేమని భావించాం. అయినప్పటికీ ఇప్పటికీ మాట్లాడుకుంటాం, ఒకరికొకరం మద్దతుగా ఉంటాం’’ అని వెల్లడించింది. ఆకాంక్ష చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఆకాంక్ష చమోలా, నటుడు గౌరవ్ ఖన్నా నవంబర్ 24, 2016న ఘనంగా వివాహం చేసుకున్నారు. గౌరవ్ స్వస్థలం అయిన కాన్పూర్‌లో మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. కెరీర్‌లో ఒకరికి మరొకరు ఎప్పుడూ మద్దతుగా నిలిచిన ఈ జంట, గతంలో అభిమానులకు ఆదర్శ దంపతులుగా కనిపించారు.
ఇక బిగ్ బాస్ 19లో గౌరవ్ పాల్గొన్న సమయంలో పిల్లల విషయంపై ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. తాను తండ్రి కావాలని కోరుకుంటున్నానని, కానీ ఆకాంక్ష మాత్రం మాతృత్వాన్ని ఎంచుకోవాలని అనుకోవడం లేదని అప్పట్లో చెప్పారు.
Akanksha Chamola confirms her divorce with Gaurav Khanna on Lock Upp😱#lockupp2 #lockupp #GauravKhanna pic.twitter.com/Sqo81Qq0Hw
— 𝐌•✰ (@24X7BiggBoss) June 27, 2026
ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో విడాకుల వార్తలను ఆకాంక్ష ఖండించింది. తన సోషల్ మీడియా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని, తమ వివాహ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పింది. అయితే ఇప్పుడు ఆమె స్వయంగా విడాకుల విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.
