కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయనుందో చెప్పాలి : అక్బరుద్దీన్ ఒవైసీ

కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయనుందో చెప్పాలి : అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో సీరియస్ చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవినీతి జరిగింది..లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నారు..దీనికి మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్  చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదు.. కాంగ్రెస్ మాపై బురద జల్లుతోందని ప్రతిపక్ష బీఆర్ ఎస్ సభ్యులు వాదించారు.  

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ పై కూడా మాట్లాడుతూ కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయనుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కేసీఆర్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు జలయజ్ణం నిర్వీర్యం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏం నిర్ణయం తీసుకుంటున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ను ఆపేస్తారా..రిపేర్లు చేయిస్తారా..కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏం చేయబోతుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజల సొమ్ము కాజేశారు.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే 20 నెలలుగా ఎందుకు రిపేర్ చేయించలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ ఎస్ కలిసే కాళేశ్వరం కుట్ర చేశారని ఆరోపించారు. 

కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టులో కేవలం ఎల్ అండ్ టీ కంపెనీకి మాత్రమే నోటీసులిచ్చారు.. ఈ ప్రాజెక్టులో అనేక కాంట్రాక్టర్లు ఉన్నారు వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో తాగునీటిప్రాజెక్టులు ఏటీఎంలా మారుతున్నాయి.. కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ గా మారకుండా చూడాలని అక్బరుద్దీన్  కోరారు. 
కమిషన్ రిపోర్టును ప్రభుత్వం లీక్ చేసిందని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అసెంబ్లీకి చేరకముందే మీడియాకు చేరిందని ఇది సరికాదని  అన్నారు. దీనిపై సమధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు.. అలా జరగలేదు.. ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చారు.