ఏజెంట్ అఖిల్ సమ్మర్లో వస్తున్నాడు

ఏజెంట్ అఖిల్ సమ్మర్లో వస్తున్నాడు

అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే సినిమాపై బజ్ ఏర్పడింది. ‘ఏజెంట్’ టైటిల్, అఖిల్  లుక్స్‌‌‌‌తో అంచనాలు ఇంకా పెరిగాయి. టీజర్‌‌‌‌లో అఖిల్ స్టైలిష్‌‌‌‌ మేకోవర్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా ఈ మూవీకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే రిలీజ్ విషయంలో అంతకంతకు వెనక్కి వెళ్లిన టీమ్.. న్యూఇయర్‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌తో అక్కినేని ఫ్యాన్స్‌‌‌‌కి కొత్త కబురు చెప్పింది.  అసలైతే ఈ చిత్రం కిందటేడాదిలోనే విడుదలవ్వాల్సి ఉంది. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది.

ఫైనల్‌‌‌‌గా ఈ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ ఖాయమంటూ మేకింగ్ వీడియోతో ప్రకటించారు. ఇందులో స్టన్నింగ్ లుక్‌‌‌‌తో కనిపిస్తున్నాడు అఖిల్. హాలీవుడ్ స్టాండర్డ్స్‌‌‌‌లో యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌ని తెరకెక్కిస్తున్నట్టు వినిపిస్తోంది.  మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, సురేందర్2 సినిమా బ్యానర్స్‌‌‌‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ  రాశాడు.  హిప్‌‌‌‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేయనున్నారు.