గుండి గోపాల్రావుపేట ఎస్సెస్సీ ఫలితాల్లో ‘అక్షర’ ప్రభంజనం : కరస్పాండెంట్ మినుకుల మునీందర్

గుండి గోపాల్రావుపేట  ఎస్సెస్సీ ఫలితాల్లో ‘అక్షర’ ప్రభంజనం : కరస్పాండెంట్ మినుకుల మునీందర్

రామడుగు, వెలుగు: రామడుగు మండలం గుండి గోపాల్​రావుపేట అక్షర హైస్కూల్​ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో నియోజకవర్గంలోనే టాప్​ మార్కులతో ప్రభంజనం సృష్టించినట్లు కరస్పాండెంట్​ మినుకుల మునీందర్​ తెలిపారు. కొలిపాక మధుమిత 589 మార్కులతో నియోజకవర్గ టాపర్​గా నిలవగా, ఏగుర్ల హర్షిణి 586, శ్రీరామోజు శ్రీజ 581, మ్యాడారపు నీతు వచన్  574 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. 

24 మంది 550కి పైగా, 69 మంది 500కు పైగా మార్కులు 100 శాతం ఫలితాలతో సత్తా చాటారని చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ మినుకుల మునీందర్, డైరెక్టర్  మినుకుల రాధ, టీచర్స్​ అభినందించారు.