ఇండియన్ ముస్లింలలో ద్వేషాన్ని నింపుతున్న ట్రెరరిస్ట్ సంస్థ ఆల్ ఖైదా

ఇండియన్ ముస్లింలలో ద్వేషాన్ని నింపుతున్న ట్రెరరిస్ట్ సంస్థ ఆల్ ఖైదా
  • భారత్ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన భద్రత బలగాలు

న్యూఢిల్లీ : ఇండియన్ ముస్లింలలో దేశం పట్ల తీవ్రమైన ద్వేషాన్ని రగిల్చేందుకు టెర్రరిస్ట్ సంస్థ ఆల్ ఖైదా ప్రయత్నం చేస్తోంది. దేశంలోని ముస్లిం మేధావులు, విద్యార్థులు జిహాద్ లో పాల్గొనాలంటూ పిలుపు ఇస్తోంది. పాకిస్థాన్ ఇంటిలెజెన్స్ సంస్థ ఐఎస్ఐ, ఆల్ ఖైదా మిడిల్ ఈస్ట్ వింగ్ సంస్థలు భారత్ లో ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని భద్రత సంస్థలు తెలిపాయి. కశ్మీర్ లో టెర్రరిస్టులను కూడా భారత్ పై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చినట్లు గుర్తించాయి. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ బిల్లు ను సాకుగా చూపుతూ ఇండియాలో ముస్లింలపై వివక్ష అంటూ ప్రచారం సాగిస్తున్నాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సోషల్ మీడియాలో ముస్లిం యువతను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తూ దేశంపై వారిలో ద్వేషం పెంచుతున్నారని ఇలాంటి 2794 లకు పైగా ట్విట్టర్ అకౌంట్లను తాము గుర్తించామని ఆయన చెప్పారు. గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తు్న్నారంటూ చెప్పారు. ఐతే కొంతమంది ముస్లిం మేధావులు కూడా వీరి ట్రాప్ లో -పడిపోతున్నారని వాస్తవాలు తెలుసుకోకుండా ఫేక్ ప్రచారాలను నమ్ముతున్నారన్నారు. అటు భారత్ లో ముస్లింలకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ), కువైట్ ప్రభుత్వం, కొన్ని అరబ్ సంస్థలు కూడా ఇటీవలే ఆరోపణలు చేశాయి.