తిరుమల భక్తులకు అలర్ట్ : TTD రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల!

 తిరుమల భక్తులకు అలర్ట్ :  TTD రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల!

సెప్టెంబర్ నెలలో తిరుమల  దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అలాగే తిరుమల, తిరుపతిలలో గదుల  కోటాను ఈరోజు (జూన్ 24న) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

ఉదయం 10 గంటలకే రూ. 300 టికెట్లు:
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టికెట్ల కోటాను బుధవారం (ఈరోజు) ఉదయం 10 గంటలకే టీటీడీ ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. టికెట్లు కావాలనుకునే భక్తులు వెంటనే బుక్ చేసుకోవచ్చు.

మధ్యాహ్నం 3 గంటలకు రూముల కోటా:
అలాగే తిరుమల కొండపైన, అటు తిరుపతిలోనూ భక్తులు వసతి పొందేందుకు వీలుగా గదుల కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు,  తిరుపతి ప్రయాణ తేదీలను బట్టి గదులను కూడా రిజర్వ్ చేసుకోవచ్చు.

ఆఫీషియల్ వెబ్‌సైట్ ద్వారానే    :
భక్తులు నకిలీ వెబ్‌సైట్ల బారిన పడకుండా, కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అయిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.

►ALSO READ | శ్రీకాళహస్తి టెంపుల్ ఆల్‌టైమ్ రికార్డు.. 40 రోజుల్లోనే రూ. 2.69 కోట్ల హుండీ ఆదాయం!