వాహనదారులకు అలర్ట్.. మే 17న హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్.. మే 17న హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో  దేశవ్యాప్తంగా తిరంగా విజయ యాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. హై కమాండ్ పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ యూనిట్ శనివారం (మే 17) హైదరాబాద్‎లో తిరంగా యాత్ర చేపట్టనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‎లోని వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. తిరంగా ర్యాలీ నేపథ్యంలో శనివారం (మే 17) సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. 

ALSO READ | మునుపెన్నడూ ఇలా లేదు.. సిద్ధంగా ఉండండి.. విద్యుత్ శాఖ అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం

శనివారం (మే 17) సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ సమయంలో పలు ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లించనున్నట్లు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ జోయల్ డేవిస్ కోరారు. ఈ తిరంగా ర్యాలీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. 


.