నాణ్యమైన విద్య కోసం ప్రత్యేక కమిషన్ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

నాణ్యమైన విద్య కోసం ప్రత్యేక కమిషన్ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదాద్రి, వెలుగు : సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఆలేరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యనందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక విద్యాకమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ప్రభుత్వ బడులు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, విద్యాబోధన పరికరాలు

విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాల, ప్రాథమిక పాఠశాలల  విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్​ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్​హనుమంతు జెండగే, ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బికూనాయక్, మున్సిపల్ వైస్ చైర్​పర్సన్ మొరిగాడి మాధవి, ఎంపీపీలు గంధమళ్ల అశోక్, వెంకటయ్య, డీఈవో నారాయణ రెడ్డి, తహసీల్దార్​ శ్రీనివాసరెడ్డి, ఎంఈవో జె.కృష్ణ, హెడ్ మాస్టర్స్ శ్యామసుందరి, లక్ష్మి, సాగర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.  

మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి

యాదగిరిగుట్ట, వెలుగు : దేశ విదేశాల నుంచి నారసింహుడి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. బుధవారం యాదగిరికొండపై ఈవో క్యాంప్ ఆఫీస్ లో ఆలయ ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు సేదతీరేందుకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డు ప్లేస్ లో.. ప్రభుత్వంతో చర్చించి త్వరలో పర్మనెంట్ షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే భక్తుల సౌకర్యార్థం కొండపై మరిన్ని టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. గిరిప్రదక్షణ చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు రిపేర్లను పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. డార్మెటరీ హాల్ కెపాసిటీ పెంచి ఎక్కువ మంది భక్తులు నిద్రించేలా సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు 
పాల్గొన్నారు.