నలుగురు మంత్రులు..కాంట్రాక్టర్ల చేతుల్లోనే రాష్ట్ర పాలన : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నలుగురు మంత్రులు..కాంట్రాక్టర్ల చేతుల్లోనే రాష్ట్ర పాలన : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • ఫ్యూచర్ సిటీ భూ దందాలపై సీబీఐ విచారణకు సిద్ధమా?: ఏలేటి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధి కారంలోకి వచ్చాక భూ భారతి కాస్తా భూహారతిగా మారిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేవలం నలుగురు మంత్రులు, నలుగురు కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే రాష్ట్ర పరిపాలన సాగుతోందని విమర్శించారు. బుధవారం  ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ధరణిలో జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి, బాధ్యులతో పైసలు కక్కిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆ నివేదికను ఎందుకు దాచిపెడుతోందని ఏలేటి ప్రశ్నించారు. 

బీఆర్​ఎస్​, కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న చీకటి ఒప్పందాల వల్లే  దోషులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా) భూ యజమానులకు శాపంగా మారిందని ఏలేటి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూములను కావాలనే 22ఏలో పెడుతున్నారనీ,  మంత్రికి 40 శాతం వాటా ఇస్తేనే ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ, వక్ఫ్, ఫారెస్ట్ భూముల వివరాలను కోర్టుకు కూడా ఇవ్వకుం డా ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని విమర్శిం చారు. రూ.2.5 లక్షల కోట్ల విలువైన ఆక్రమిత భూము లను స్వాధీనం చేసుకుంటామన్న డిప్యూటీ సీఎం భట్టి  మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓ మంత్రి తన కుటుంబానికి చెందిన కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టుకోవడం ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ కిందకు వస్తుందని, ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. 

చర్చకు నేను రెడీ.. మీరు సిద్ధమా?

ఫ్యూచర్ సిటీ భూ దందాలు, 22ఏ అక్రమాలపై సీబీ ఐ లేదా ఈడీ విచారణకు సిద్ధమా అని ప్రభుత్వాన్ని ఏలేటి ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధారాలు అడుగుతున్నారని, తాను ఆధారాలతో సహా బహి రంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.