జేఈఈ ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం

జేఈఈ ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం

కరీంనగర్ టౌన్, వెలుగు: జేఈఈ మెయిన్–2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీహెచ్. లక్ష్మీ హాసిని 99.94 పర్సంటైల్‌‌తో అగ్రస్థానంలో నిలవగా, వి. శ్రేయాస్ రెడ్డి99.83, కె. ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74, బి. లిఖిత్ సాయి 99.6, ఎ. సత్య వర్ధన్ 99.6. జి. ఆశిష్ రెడ్డి 99.53, ఎన్. రత్న ప్రకాశ్99.38,  బి. శ్రీహాన్ 99.27 యు.అభినవ్ చౌదరి 99.25, ఎల్. ప్రణయిణి రెడ్డి 99.13, వి. సుహాని 99.111 పర్సంటైల్ సాధించారని తెలిపారు. 99 పర్సంటైల్ ఆపైన12 మంది విద్యార్థులు సాధించినట్టు, 90 పర్సంటైల్ ఆపైన113 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. 

రెండో విడత ఫలితాల్లో సైతం అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని  ధీమా వ్యక్తం చేశారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషితోనే ఇంతటి ఘనవిజయం సాధించామని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.