ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిద్ధమైంది. సాధారణంగానే థ్రిల్లర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఇక ఉత్కంఠభరితమైన ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో సాగే కథ అయితే, ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి బ్యాక్డ్రాప్ లోనే ‘రాఖ్’ వెబ్‌సిరీస్ (Raakh) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పాతాళ్‌లోక్’తో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ప్రొసిత్ రాయ్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశాడు.
లేటెస్ట్గా ‘రాఖ్’ వెబ్‌సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జూన్ 12, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ సిరీస్‌లో అలీ ఫజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, సోనాలీ బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
buried truths always find their way back 🤫#RaakhOnPrime, New Series, June 12 @deepak30000 @NegiR @sunandagj @prosit_roy @anusha_nkumar @sandeepsaket83 #AliFazal @iamsonalibendre @EndemolShineIND @BhaDiPa #AamirBashir @therakeshbedi @debu_dibyendu @deepali_handa @siddhuin… pic.twitter.com/mdMEyIgURw
— prime video IN (@PrimeVideoIN) May 29, 2026
స్టోరీ బ్యాక్డ్రాప్:
ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ కలిసి రూపొందించారు. ఇద్దరు టీనేజర్లు అనుమానాస్పదంగా అదృశ్యమవడంతో కథ మొదలవుతుంది. ఈ కేసు ఒక కుటుంబాన్ని కుదిపేయడమే కాకుండా నగరంలో భయాందోళనలు రేకెత్తిస్తుంది. దీంతో ఓ పట్టుదల గల పోలీస్ అధికారి కేసు విచారణ ప్రారంభిస్తాడు. కానీ కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ హింస, మానసిక వేదనలు, నైతిక సందిగ్ధతలతో నిండిన భయానక ప్రపంచం అతని ముందుకొస్తుంది.
►ALSO READ | OTT Drama: అప్పులున్న ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా.. ఓటీటీలో తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ సిరీస్ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా మానవ మనస్తత్వం, న్యాయం, పశ్చాత్తాపం, విముక్తి వంటి భావోద్వేగ అంశాలను కూడా టచ్ చేయనుంది. అలీ ఫజల్ పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
‘పాతాళ్ లోక్’:
అమెజాన్ ప్రైమ్లో రిలీజైన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పాతాల్ లోక్ (Pathal Lok ). ఈ సిరీస్ 2020లో వచ్చి ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. ఒక్కో షాట్ ఒక్కో థ్రిల్లింగ్ వావ్ మూమెంట్ ఇస్తుంది. ఈ సిరీస్ సీజన్ 2 గతేడాది 2025లో వచ్చి ఆ థ్రిల్లింగ్ని మరింత పెంచింది. ఇపుడు ఇలాంటి గ్రిప్పింగ్ స్టోరీని అందించిన డైరెక్టర్ నుంచి మరో సిరీస్ వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
