థ్రిల్లర్ ఆడియన్స్ను అలరించేందుకు ‘రాఖ్’ (Raakh) వెబ్‌సిరీస్ సిద్ధమైంది. ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్, షాకింగ్ ట్విస్టులతో రూపొందిన ఈ సిరీస్‌ను ‘పాతాళ్ లోక్’ ఫేమ్ ప్రొసిత్ రాయ్ తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్నఈ సిరీస్ త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ కలిసి రూపొందించారు. జూన్ 12, 2026 నుంచి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది.
1970 ఢిల్లీ బ్యాక్ డ్రాప్- పిల్లల కిడ్నాప్‌లు..
ఈ సిరీస్‌కు ఢిల్లీలో సంచలనం సృష్టించిన ‘రంగా-బిల్లా’ కేసు స్ఫూర్తిగా నిలిచింది. ఆ కేసులో కుల్జీత్ అలియాస్ రంగా, జస్బీర్ సింగ్ అలియాస్ బిల్లా ఇద్దరు టీనేజ్ యువకులను అత్యాచారం చేసి హత్య చేసిన నేరంలో దోషులుగా తేలి ఉరిశిక్ష పొందారు. ఇదే కేసును ఆధారంగా చేసుకుని గతంలో ‘బ్లాక్ వారెంట్’ సిరీస్‌లో కూడా ఒక ఎపిసోడ్ రూపొందించారు.
ఇపుడు తాజాగా అదే ‘రంగా-బిల్లా’ కేసు స్ఫూర్తితో ‘రాఖ్’ సిరీస్ తెరకెక్కిందని ట్రైలర్తో క్లారిటీ వచ్చింది. ఇందులో మీర్జాపూర్ హీరో అలీ ఫజల్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్‌గా నటించగా, సోనాలి బింద్రే మోనా అరోరా పాత్రలో కనిపించనుంది. దుఃఖం, న్యాయం, నేరాల ప్రభావం వంటి అంశాలతో రూపొందిన ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
buried truths always find their way back 🤫#RaakhOnPrime, New Series, June 12 @deepak30000 @NegiR @sunandagj @prosit_roy @anusha_nkumar @sandeepsaket83 #AliFazal @iamsonalibendre @EndemolShineIND @BhaDiPa #AamirBashir @therakeshbedi @debu_dibyendu @deepali_handa @siddhuin… pic.twitter.com/mdMEyIgURw
— prime video IN (@PrimeVideoIN) May 29, 2026
క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు..
ఇద్దరు టీనేజర్లు అనుమానాస్పదంగా అదృశ్యమవడంతో కథ మొదలవుతుంది. ఈ కేసు ఒక కుటుంబాన్ని కుదిపేయడమే కాకుండా నగరంలో భయాందోళనలు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో ఒక భయానక నేరం కారణంగా బాధిత కుటుంబాల జీవితాలు ఎలా తలకిందులవుతాయో చూపించారు.
అదే సమయంలో మనిషి మనస్తత్వంలోని చీకటి కోణాలను కూడా కథ చెప్పబోతుందనే హింట్ ఇచ్చారు. ఆమిర్ బషీర్, సోనాలి బింద్రే దంపతులుగా కనిపిస్తుండగా, తమ కిడ్నాప్‌కు గురైన పిల్లల కోసం పోలీసులను ఆశ్రయించే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. దీంతో ఓ పట్టుదల గల పోలీస్ అధికారి కేసు విచారణ ప్రారంభిస్తాడు. కానీ కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ హింస, మానసిక వేదనలు, నైతిక సందిగ్ధతలతో నిండిన భయానక ప్రపంచం అతని ముందుకొస్తుంది.
ALSO READ : తల్లి కాబోతున్న అనుష్క..
ఈ సిరీస్ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా మానవ మనస్తత్వం, న్యాయం, పశ్చాత్తాపం, విముక్తి వంటి భావోద్వేగ అంశాలను కూడా టచ్ చేయనుంది. అలీ ఫజల్ పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ కేసును ఛేదించే పోలీస్ అధికారి సబ్ ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ పాత్రలో అలీ ఫజల్ ఇంటెన్స్ రోల్లో నటించాడు. కేసు విచారణలో ఎదురయ్యే నైతిక సందిగ్ధతలు, మానసిక ఒత్తిడిని అతని పాత్ర ద్వారా చూపించారు. దిబ్యేందు భట్టాచార్య అతని సీనియర్ అధికారిగా కనిపించనుండగా, రాకేష్ బేడీ అలీ ఫజల్ తండ్రి పాత్రలో నటించారు.
సిరీస్ గురించి అలీ ఫజల్ మాట్లాడుతూ, “ఇది కేవలం సాధారణ పోలీస్ దర్యాప్తు కథ కాదు. సమాజం, రాజకీయ పరిస్థితుల మధ్య తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించే లోపాలు ఉన్న పోలీస్ అధికారి పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది” అని తెలిపారు.
సోనాలి బింద్రే మాట్లాడుతూ, “మోనా అరోరా పాత్రలో నేను ఇంతకుముందు చేయని భావోద్వేగాలను ఆవిష్కరించే అవకాశం లభించింది. ఇది నటిగా నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం” అని చెప్పారు.
‘పాతాళ్ లోక్’ డైరెక్టర్ మార్క్:
అమెజాన్ ప్రైమ్లో రిలీజైన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పాతాల్ లోక్ (Pathal Lok ). ఈ సిరీస్ 2020లో వచ్చి ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. ఒక్కో షాట్ ఒక్కో థ్రిల్లింగ్ వావ్ మూమెంట్ ఇస్తుంది. ఈ సిరీస్ సీజన్ 2 గతేడాది 2025లో వచ్చి ఆ థ్రిల్లింగ్ని మరింత పెంచింది. ఇపుడు ఇలాంటి గ్రిప్పింగ్ స్టోరీని అందించిన డైరెక్టర్ నుంచి మరో సిరీస్ వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
