బాలీవుడ్ క్రేజీ కపుల్ అనుష్క రంజన్, ఆదిత్య సీల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. 2021లో వివాహం చేసుకున్న ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా మెటర్నిటీ ఫోటోషూట్‌తో తమ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో అనుష్క మెరవగా, ఇక ఆదిత్య ధరించిన టీ-షర్ట్‌పై "Baap" (తండ్రి) అని రాసి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“నీ కోసం నేను వందేళ్లు ఎదురుచూశాను.. అవసరమైతే మరో లక్షల ఏళ్లైనా ఎదురుచూస్తాను. నీవు మా జీవితంలోకి అడుగుపెడుతున్న ఆ క్షణం ఎంత అద్భుతమో! నీవు మావాడివి/మాదానివి కావడం అనే ఈ అదృష్టం నా జీవితాన్ని ఎంతటి అదృష్టమో ఇప్పుడే పూర్తిగా అర్థమవుతోంది” అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ భావోద్వేగ సందేశం అభిమానులను మరింత ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనన్య పాండే “అవ్ యే! కంగ్రాట్యులేషన్స్” అని అనగా, భూమి పడ్నేకర్ “ఓ మై గాడ్.. చాలా చాలా సంతోషంగా ఉంది” అని విష్ చేసింది. మరో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా “ఓఎంజీ.. కంగ్రాట్యులేషన్స్ గైస్”అని "ఓ మై గాడ్, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కామెంట్ చేయగా, అలాగే రకుల్ సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పింది.
ఈ శుభవార్తపై తోటి నటీనటుల నుంచి వచ్చిన విషెష్ అనుష్కకు ఆనందాన్ని ఇచ్చాయి. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది.
“ఈ సంతోషకరమైన విషయాన్ని అందరితో పంచుకునే ముందు మాకు కొంత సమయం కావాలనిపించింది. అందుకే ఈ ప్రకటనలో కొంత ఆలస్యం జరిగింది. నిజం చెప్పాలంటే, మా పెళ్లి వార్తను వెల్లడించినప్పుడు కంటే ఈ గుడ్‌న్యూస్‌ను ప్రకటించే సమయంలోనే నేను ఎక్కువ టెన్షన్‌కు గురయ్యాను. అయితే ఇప్పుడు మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల నుంచి వస్తున్న ప్రేమ, శుభాకాంక్షలు చూసిన తర్వాత ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా అనిపిస్తోంది” అని అనుష్క తెలిపింది.
గతంలో వచ్చిన ప్రెగ్నెన్సీ వార్తలు..
2023 జనవరిలో కూడా అనుష్క గర్భవతి అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో ఆ వార్తలను ఈ జంట ఖండించింది. ఆ సమయంలో అనుష్క, తన ఒడిలో తల పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆదిత్య ఫోటోను షేర్ చేస్తూ, “ప్రస్తుతం నా జీవితంలో ఉన్న ఏకైక బేబీ ఇతనే” అంటూ సరదాగా స్పందించింది. ఆదిత్య కూడా అదే ఫోటోను పంచుకుని ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.
అనుష్క రంజన్, ఆదిత్య సీల్ గురించి:
అనుష్క రంజన్ 2015లో వచ్చిన వెడ్డింగ్ పుల్లే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తర్వాత ఫిట్ట్రాట్, బట్టి గుల్ మీటర్ చాలు వంటి ప్రాజెక్టుల్లో నటించింది. ఆమె తల్లి అను రంజన్ ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) స్థాపకురాలు కాగా, ఆమె సిస్టర్ ఆకాంక్ష రంజన్ కపూర్ కూడా నటిగా గుర్తింపు పొందింది.
ALSO READ : టోక్యో వీధుల్లో రష్మిక-విజయ్ జంట..
ఇక ఆదిత్య సీల్ - స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో మనవ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగేతుమ్ బిన్ II, ది ఎంపైర్, ఖేల్ ఖేల్ మే వంటి చిత్రాలు, సిరీస్‌లలో కూడా నటించాడు. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలో కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతూ, తల్లిదండ్రులుగా మారేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
