నవంబర్ 18న ‘అలిపిరికి అల్లంత దూరంలో ‘ రిలీజ్

నవంబర్ 18న ‘అలిపిరికి అల్లంత దూరంలో ‘ రిలీజ్

తిరుపతి బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రావణ్ నిట్టూరు, శ్రీ నికిత జంటగా రూపొందుతోన్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’.   దర్శకురాలు నందినిరెడ్డి దగ్గర అసిస్టెంట్​గా చేసిన  జె.ఆనంద్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర  కలిసి నిర్మిస్తున్నారు.

నవంబర్ 18న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్​మెంట్​ వీడియో  ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ‘మా తిరుపతి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి, లహరి గుడివాడ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతాన్ని 
అందిస్తున్నాడు.