ఒడిశా సర్కారు సంచలన నిర్ణయం.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్

ఒడిశా సర్కారు సంచలన నిర్ణయం.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు  రిక్రూట్‌మెంట్ విధానాన్ని శాశ్వతంగా  రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. 


"కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేటికీ చాలా రాష్ట్రాల్లో కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఒడిశాలో కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ శకం నేటితో  ముగిసింది. ఈ నిర్ణయం వారి కుటుంబ సభ్యుల కోసం దీపావళిని ముందుగానే తీసుకొచ్చింది" అని నవీన్ పట్నాయక్ అన్నారు. 

ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 57,000 మందికిపైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ నిర్ణయం అమలుకు నవీన్ పట్నాయక్  సర్కారు ఏడాదికి దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చు చేయనుంది.