జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి

రంగారెడ్డి, వెలుగు: అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘు డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్లలో కోతలు ఆపాలంటూ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.అనంతరం డీఆర్వో సంగీత, డీపీఆర్వో బాలేశ్వరికి వినతిపత్రం అందజేశారు.