మమ్మల్నీ పర్మినెంట్ చేయాలి..ఓయూ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌

మమ్మల్నీ పర్మినెంట్ చేయాలి..ఓయూ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌

ఓయూ, వెలుగు: ఇంటర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల​లాగే తమను కూడా రెగ్యులరైజ్​చేయాలని కోరుతూ ఓయూలోని కాంట్రాక్ట్​లెక్చరర్స్‌ గురువారం ఆర్ట్స్​కాలేజీ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్​లెక్చరర్ల సంఘం నాయకులు డా.పరశురామ్, డా.ధర్మతేజ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో ఏండ్లుగా పనిచేస్తున్నామని, ఇప్పటికే  ప్రభుత్వం రెండుసార్లు తమను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

 ప్రభుత్వం ఇటీవల ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల లెక్చరర్లను పర్మినెంట్​చేసిందని, అదే విధంగా తమను కూడా చేయాలని కోరారు. దేశంలోని పలు యూనివర్సిటీలు కాంట్రాక్ట్ లెక్చరర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు  రెగ్యులరైజ్ చేశాయని చెప్పారు.