బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు అడ్డు ...జస్టిస్ ఈశ్వరయ్య

బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు అడ్డు ...జస్టిస్ ఈశ్వరయ్య

కామారెడ్డి, కామారెడ్డిటౌన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అన్ని పార్టీలు అడ్డు పడుతున్నాయని జస్టిస్​ ఈశ్వరయ్య ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో రిజర్వేషన్ల సాధన సమితి స్టేట్​ ప్రెసిడెంట్​ చిరంజీవి అధ్యక్షతన జరిగిన బీసీ ఆక్రోశ సభలో ఆయన మాట్లాడారు. 

బీసీలకు రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్​ నాటకం ఆడుతోందన్నారు. రాజ్యంగంలోని 9వ షెడ్యూల్​లో చేర్చకుండా బీజేపీ మోకాలడ్డుతోందన్నారు. బీసీలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్​ను కాంగ్రెస్​ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. 

అగ్రవర్ణాలు రిజర్వేషన్లను అడ్డుకోవడం తగదన్నారు. విశారదన్​ మహరాజ్​మాట్లాడుతూ.. ఢిల్లీ వేదికగా యుద్ధం చేయాలని, ఇందులో సీఎం రేవంత్​రెడ్డి, కేటీఆర్​ ముందుండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విమలక్క, సినీ డైరెక్టర్​ శంకర్​, బీసీ నాయకులు బాల్​రాజ్​గౌడ్​, భూమన్న, సిద్ధిరాములు పాల్గొన్నారు.