అల్లరి నరేశ్ 60వ సినిమా ఫస్ట్ లుక్..

అల్లరి నరేశ్ 60వ సినిమా ఫస్ట్ లుక్..

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ తన 60వ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించనున్నాడు. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సంకెళ్లు ఉన్న రెండు చేతులు.. గోడపై పక్షి నీడలా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ అల్లరి నరేశ్ ట్విట్టర్ లో షేర్ చేసి... ‘షాడో ఆఫ్ హోప్ అని హ్యాష్ ట్యాగ్ చేశాడు. విజయ్ కనకమేడల ఈ సినిమాతో అల్లరి నరేశ్ ను మరో ఆసక్తికరమైన రోల్‌లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీలో ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం గురించి త్వరలో వెల్లడించనున్నారు.