
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ హాట్ హాట్ గా సాగింది. మంత్రి మల్లారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ. బి3 ల్యాండ్స్ ను కబ్జాచేసి వాటిలో అక్రమ నిర్మాణాలు కడుతున్నారన్నారు. మంత్రి మల్లారెడ్డి ఆ ల్యాండ్ ను బోర్డుకు ఇచ్చేస్తే దాంట్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీతో కంటోన్మెంట్ బోర్డు పాలనా సమయం పూర్తి అవుతుండడంతో సమావేశం ఏర్పాటు చేశారు బోర్డు మెంబర్లు. మీటింగ్ లో మంచినీటి సమస్యపై ప్రధానంగా చర్చ జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో మూడు నుంచి ఐదు రోజులకు ఒక్కసారే వాటర్ ఇస్తున్నట్లు బ్రిగేడియర్ దృష్టికి తీసుకెళ్లారు మెంబర్లు. అలాగే B3, B4 స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.