హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యాడు. మొదటి విచారణ నేపథ్యంలో సోమవారం వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉండగా.. ముంబైలో సినిమా షూటింగ్ కారణంగా హాజరు కాలేదు. వర్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతారని ఆయన తరుపు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఇందుకు సంబంధించి మెమో దాఖలు చేశారు. కోర్టు అనుమతి మేరకు.. వీడియో లింకేజ్ ద్వారా అల్లు అర్జున్ ముంబై నుంచి హాజరయ్యాడు. సంధ్య థియేటర్ యాజమాన్యం సహా మొత్తం12 మంది నిందితులు నాంపల్లి కోర్టు విచారణకు అటెండ్ అయ్యారు. వీరంతా వ్యక్తిగత బాండ్లపై సంతకాలు చేసి కోర్టుకు సమర్పించారు. దీంతో కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి జులై 6కు వాయిదా వేశారు.
