హైదరాబాద్, వెలుగు: టీ గోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న టీ9 చాలెంజ్ గోల్ఫ్ టోర్నీ నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. 8 జట్లు నాకౌట్‌లో అడుగుపెట్టాయి. పూల్– ఏ నుంచి 12 పాయింట్లతో వి సాఫ్ట్ టైటాన్స్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బంకర్ బస్టర్స్ (11.5), పార్ టైమర్స్ (11), దాసోస్ బై మహి (10) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాలను సాధించాయి.
పూల్–బి నుంచి ఆర్డీ ఐరన్ ఈగల్స్ 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. చాముండి బౌల్డర్ హిల్స్ టైగర్స్ 10.5 పాయింట్లతో రెండో స్థానంలో, ఫెయిర్ వే వారియర్స్ , హైదరాబాద్ గోల్ఫర్స్ యునైటెడ్ పదేసి పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి నాకౌట్ రౌండ్ కు అర్హత సాధించాయి. నోవాటెల్ స్టార్స్ , జాగృతి జాగర్స్, రాజ్ పుష్ప ఇన్విక్టా, శ్రీమ్యాట్రిక్స్ ఈగల్స్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
