హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారనే అపోహలను నమ్మొద్దని విద్యుత్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌మిట్టల్ అన్నారు. సోమవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ప్రతినిధులు సెక్రటేరియెట్‌లో ఆయనతో సమావేశమయ్యారు.
జేఏసీ నేతలు థర్డ్ డిస్కమ్, వైటీపీఎస్ ప్లాంట్‌లో ప్రైవేట్ టెండర్లు వంటి అంశాలపై చర్చించారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులందరూ సంస్థల అభివృద్ధి, విద్యుత్ రంగ ప్రగతిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచించారు.సమావేశంలో పీఆర్సీ, ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలు, వైద్య సదుపాయాలు, పెండింగ్ ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు.
