ISSF జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్షిప్‌: ప్రీతమ్కు స్వర్ణం

ISSF జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్షిప్‌: ప్రీతమ్కు స్వర్ణం

సుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జర్మనీ): ఇండియా షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెండ్రీ.. ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ పతకం గెలిచాడు. సోమవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ప్రీతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 251.3 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.

టిమోఫే అలీనికోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓస్టిలి వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. ఇండియాకే చెందిన పీయూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఇండియాకు కాంస్యం లభించింది.

అంజలి భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–పారిషా గుప్తా–నిథిలా క్రిస్టోఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన ఇండియా త్రయం 1713 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో అంజలి భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. షూటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడి ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఇండియా ఐదు స్వర్ణాలతో కలిపి 11 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉంది.