ట్యాంక్ బండ్, వెలుగు: నానక్ రామ్ గూడ రోడ్డుకు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వామపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నాయకులు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను చెప్పిన మాట వినకపోతే దేశాలపై యుద్ధాలు చేస్తున్న ట్రంప్ యుద్ధ ఉన్మాది అని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలకు కారకుడైన ఆయన పేరును ఇక్కడ పెట్టొద్దని, సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
