ప్రైవేట్‌లో ఫీజుల దోపిడీని నియంత్రించాలి ..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడించిన ఏఐఎస్ఎఫ్

ప్రైవేట్‌లో ఫీజుల దోపిడీని నియంత్రించాలి ..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడించిన ఏఐఎస్ఎఫ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముట్టడించింది. సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ నేతృత్వంలో కార్యకర్తలు, విద్యార్థులు టెలిఫోన్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో డైరెక్టరేట్​ ముందు బైఠాయించి,  నిరసన తెలిపారు. దీంతో పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు.  

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లు అంగడి కేంద్రాలుగా మారాయని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని గాలికి వదిలేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు గ్యార నరేష్, బానోత్ రఘురాం, రెహమాన్, లెనిన్, చైతన్య యాదవ్, అన్వర్, శాంతి కుమార్, దత్తు రెడ్డి, ఆకాశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.