గంగారంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తింపు

గంగారంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తింపు

కొత్తగూడ (గంగారం), వెలుగు: నీతి ఆయోగ్​ స్కీమ్​లో ఎంపికైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తించినట్లు కలెక్టర్​ స్నేహ శబరీశ్​స్టేట్ సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్​కు తెలిపారు. సోమవారం నీతి ఆయోగ్ లో ఎంపికైన గంగారం మండల అభివృద్ధిపై సెర్ఫ్ సీఈవో కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ గంగారం మండలంలోని 12 జీపీల్లో 791 కుటుంబాలను నిరుపేదలుగా గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్​చార్జి అడిషనల్​ కలెక్టర్, హౌసింగ్​ పీడీ పురుషోత్తం, డీఆర్డీవో పీడీ మధుసూదన్​రాజు తదితరులున్నారు.​