యువత  డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఆఫీసర్లు

యువత  డ్రగ్స్కు దూరంగా ఉండాలి : ఆఫీసర్లు

ఖమ్మం టౌన్/ కూసుమంచి/ గ్రేటర్​ వరంగల్/ నల్లబెల్లి, వెలుగు: యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్టెమ్​పార్క్​ జూనియర్​ కాలేజ్​లో ఏసీపీ రమణమూర్తి, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో స్థానిక పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు. కాగా, వరంగల్​ కలెక్టరేట్​లో నార్కోటిక్​ కో ఆర్డినేషన్​ జిల్లా కమిటీ సమావేశాన్ని కలెక్టర్​ సత్యశారద ఆధ్వర్యంలో డీసీపీ అంకిత్​కుమార్, అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణితో కలిసి నిర్వహించారు.

మత్తుపదార్థాల నియంత్రణపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాట్లాడారు. అనంతరం నార్కోటిక్​ వాల్​పోస్టర్​ను ఆవిష్కరించారు. ​నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో ఎస్సైలు ప్రసన్నకుమార్, రణధీర్​రెడ్డి అవగాహన కల్పించారు. ​జనగామ అర్బన్: జనగామ జిల్లా ధర్మకంచ జడ్పీహెచ్​ఎస్, ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో డీసీపీ రాజమహేంద్రనాయక్​ విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.