FIFA వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించిన మెస్సీ.. 18 గోల్స్ కొట్టి పాత రికార్డులు బద్ధలు !

FIFA వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించిన మెస్సీ.. 18 గోల్స్ కొట్టి పాత రికార్డులు బద్ధలు !

FIFA ఫుట్ బాల్ వరల్డ్ కప్లో లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆర్లింగ్‌టన్‌లో జరిగిన గ్రూప్ జె మ్యాచ్‌లో అర్జెంటీనా ఆస్ట్రియాను 2-0 తేడాతో ఓడించింది. రౌండ్ ఆఫ్ 32లో స్థానం సంపాదించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ 38వ నిమిషంలో ఫస్ట్ గోల్ చేసి, స్టాపేజ్ టైమ్‌లో మరో గోల్ కొట్టాడు.

ఈ రెండు గోల్స్‌తో.. మెస్సీ తన ఫిఫా వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నాడు. జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోస్ 16 గోల్స్ రికార్డును అధిగమించి మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ కొత్త చరిత్ర లిఖించాడు.

అల్జీరియాపై 3–0 తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని అర్జెంటీనా గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రౌండ్ ఆఫ్ 32 (Round of 32) బెర్తును కన్ఫర్మ్ చేసుకుంది. ఈ వరల్డ్ కప్‌లో టాప్ పర్ఫామర్‌గా మెస్సీ దూసుకుపోతున్నాడు.

కాగా తమ మొదటి మ్యాచ్‌లో.. జోర్డాన్‌ను 3–1తో ఓడించిన ఆస్ట్రియా టీమ్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగినప్పటికీ మెస్సీ దూకుడుకు అడ్డుకట్టవేయలేకపోయింది.