భద్రాచలం రామయ్య హుండీ లెక్కింపు

భద్రాచలం రామయ్య హుండీ లెక్కింపు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజుల్లో హుండీ ద్వారా రూ.2,43,64,452 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దామోదర్‌‌‌‌రావు తెలిపారు. ఈసారి హుండీల్లో 51 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి లభించినట్లు వెల్లడించారు.

అమెరికా డాలర్లు 659, సౌదీ అరేబియా రియాల్స్ 205, యూఏఈ దిర్హమ్స్ 160, కువైట్ దీనార్‌‌‌‌లు 2, థాయ్‌‌‌‌లాండ్ బాత్‌‌‌‌లు 20, ఖతార్ రియాల్స్ 1, వియత్నాం డాంగ్‌‌‌‌లు 2 వేల, చైనా యువాన్ 1,  ఒమన్ బైసా 100, స్వీడన్ క్రోనార్‌‌‌‌లు 120, ఫిలిప్పీన్స్ పిసో 100 వచ్చాయని తెలిపారు. గోశాల నిర్వహణకు హుండీల ద్వారా రూ.10,55,730, అన్నదానం కోసం రూ.4,29,110 వచ్చినట్లు ఈవో వివరించారు.