‘టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవం ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జ్యూరీ ఛైర్‌పర్సన్ ఇంద్రజ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, షార్ట్ ఫిలిం ఎంట్రీలు పంపిన యువతలో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సినిమా పరిశ్రమలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి ప్రైజ్ మనీని రూ.1 లక్షకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డును ‘శీనుగాడి సైకిల్ స్టోరీ’ గెలుచుకోగా, ‘సైబర్ స్లేవరీ’ రెండు ‘మాతృదేవోభవ’ మూడో స్థానాలను దక్కించుకున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మానవతావాది సుభాష్ రెడ్డి తిమ్మయ్యగారి మాట్లాడుతూ ‘తెలుగు ప్రజలంతా ఒకటిగా అవార్డులు అందుకోవాలి. వచ్చే ఏడాది అవార్డులకు ప్రైజ్ మనీగా ఇవ్వనున్న రూ.లక్ష నేనే స్వయంగా ఇస్తాను.
యువ ప్రతిభను ప్రోత్సహించడానికి నావంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ బీఐ బ్యాంక్ బోర్డ్ మెంబర్ నరసింహ, హైకోర్టు అడ్వకేట్ సుభాష్ రెడ్డి, టీమా ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్, సుప్రీంకోర్టు అడ్వకేట్, నిర్మాత షరీఫ్, హీరోయిన్ అక్సఖాన్, టీఎఫ్ సీసీ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్ పాల్గొని యువ ప్రతిభను అభినందించారు.
