హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ముఖ్య పాత్రలు పోషించారు. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇలాంటి వినూత్న చిత్రాలు తప్పకుండా విజయవంతం అవ్వాలని అతిథిగా హాజరైన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి విష్ చేశారు.
నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ ‘ఇది కేవలం ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాలు ఉన్న సినిమా. ఇందులో నాకు, కబీర్ సింగ్ మధ్య ఉండే ట్రాక్ బాగుంటుంది’ అని చెప్పాడు. దర్శకుడు రవి కుమార్ సీరపు మాట్లాడుతూ ‘కథే హీరోగా ఈ సినిమా తీశాం. షూటింగ్ అంతా కర్నూల్‌లో చేశాం.
ప్రేక్షకులు కొన్న టికెట్ ధరకు న్యాయం చేసేలా సినిమా ఉంటుంది. ఎక్కడ రెడ్ బ్యాగ్ చూసినా మా సినిమా గుర్తొస్తుంది’ అని చెప్పారు. టీజర్ తరహాలోనే సినిమా కూడా మెప్పిస్తుందని నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి చెప్పారు. రాధ్య, ఆకాంక్ష, మోనిక, లిరిక్ రైటర్ తిరుపతి, రైటర్ హరి ప్రసాద్ పాల్గొన్నారు.
