లైఫ్ టైమ్ మెమొరీ ఇచ్చే దీవాన

లైఫ్ టైమ్ మెమొరీ ఇచ్చే దీవాన

‘శుభం’ ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందించిన చిత్రం ‘దీవాన’.  వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 20న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సక్సెస్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌లో  హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘మేం  గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా.  ఇందులో  ఒక రియల్ లైఫ్‌‌‌‌‌‌‌‌ను చూపించాం.  ఇదొక టైమ్ లెస్ లవ్ స్టోరీ.   

ఎప్పుడు చూసినా నచ్చుతుంది. ఈ సినిమా లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది’ అని అన్నాడు.  డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ ‘మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండూ ఉన్నాయి.  ‘కేజీఎఫ్’లో ఎలివేషన్ సీన్స్‌‌‌‌‌‌‌‌కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మా  మూవీలో చిన్న చిన్న డైలాగ్స్‌‌‌‌‌‌‌‌కు కూడా వస్తోంది. ఈ చిత్రం శతదినోత్సవం దాకా వెళ్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. 

ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ ‘మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా  మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పారు.  ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ ‘మా సినిమాకొస్తున్న రెస్పాన్స్ పట్ల చాలా సంతోషంగా ఉంది. 

కానీ సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో  టికెట్స్ బుక్ చేసుకునే వారికి 18 ఫ్లస్ అని చూపిస్తోంది.  నేను ఒక ఆడపిల్లగా చెబుతున్నా.  ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌తో ధైర్యంగా చూసే సినిమా ఇది’ అని అన్నారు.  నటులు ఝాన్సీ,  జీవన్ కుమార్,  నర్సింగ్,  టోనీ,  కె కె,  సింధు, ఫైట్ మాస్టర్ హరి,  మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ పాల్గొన్నారు.