సమాజంలో మార్పు కోసం.. ఎల్‌‌‌‌‌‌‌‌జిబీటీ ఏ లీగల్ బ్యాటిల్ మూవీ 

సమాజంలో మార్పు కోసం.. ఎల్‌‌‌‌‌‌‌‌జిబీటీ ఏ లీగల్ బ్యాటిల్ మూవీ 

 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌ జీవితాలపై పి.సునీల్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి దర్శకనిర్మాతగా తెరకెక్కించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘ఎల్‌‌‌‌‌‌‌‌జిబీటీ ఏ లీగల్ బ్యాటిల్’. సుభాష్ చక్రవర్తి రవడ కో ప్రొడ్యూసర్. ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి, ప్రీతీ నిగమ్‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు రియల్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్రలు పోషించారు.  ఈనెల 19న విడుదలైంది.  సినిమాకు వస్తున్న  రెస్పాన్స్ తెలియజేసేందుకు సోమవారం ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. 

దర్శనిర్మాత పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చాటిచెప్పేందుకు ఈ సినిమా తీశా. పలు ఛారిటీ సంస్థలు, ఆర్గనైజేషన్స్‌‌‌‌‌‌‌‌ సహా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమాజంలో ఓ మంచి మార్పుకు ఈ చిత్రంతో అడుగుపడాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు.  

గే, ట్రాన్స్ జెండర్ సమస్యలు చెబుతూ తెలుగులో వచ్చిన ఫస్ట్ సినిమా ఇదని నటుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు.  ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు.  నటుడు వంశీకృష్ణ, పలువురు గే, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టివిస్టులు, సోషల్ ఆర్గనైజేషన్స్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.