యూఎస్ ఓపెన్ సూపర్ – 300 బ్యాడ్మింటన్ టోర్నీ: టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టి

యూఎస్ ఓపెన్ సూపర్ – 300 బ్యాడ్మింటన్ టోర్నీ: టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టి

పుల్లెర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–300 బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీకి ఇండియా ప్లేయర్లు రెడీ అయ్యారు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్న లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాడు. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను జూలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరాగీ (బెల్జియం)తో తలపడతాడు. ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. లియావో జువోపు (చైనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తైపీ)తో తలపడతాడు.

సనీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దయానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముత్తుస్వామి కూడా ప్రధాన డ్రాలో చోటు సంపాదించారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు. తన్వీ శర్మ, దేవిక సిహాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఎక్కువగా అంచనాలున్నాయి. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన్వీ.. వైవోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీ (జర్మనీ), దేవిక.. ఇనెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూసియా (పెరూ)తో తలపడతారు.