లండన్: అమెరికా టెన్నిస్ లెజెండ్, 23 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న సెరెనా.. రాబోయే వింబుల్డన్‌లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే డబుల్స్‌లో ఆడుతున్న సెరెనా.. సింగిల్స్‌లోనూ బరిలోకి దిగనుంది.
ఈమేరకు సెరెనాకు వైల్డ్ కార్డు కేటాయించినట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వెల్లడించింది. 44 ఏళ్ల వయసు ఉన్న సెరెనా.. వింబుల్డన్ డబుల్స్‌లో తన సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి పోటీపడనుంది. సెరెనా చివరిసారి 2022 యూఎస్ ఓపెన్ మూడో రౌండ్‌లో సింగిల్స్ మ్యాచ్ ఆడింది.
ఆ ఓటమి తర్వాత ఆటకు దూరమైంది. వింబుల్డన్ గడ్డి కోర్టులపై సెరెనాకు తిరుగులేని రికార్డు ఉంది. ఆమె సాధించిన 23 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో ఏడు వింబుల్డన్ (2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016) వేదికగానే వచ్చాయి.
