ఔరంగాబాద్ తర్వాత హైదరాబాద్ తన సెకండ్ హోమ్ అని చెబుతున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. ఓవైపు తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల్లోనూ బిజీ అవుతోంది. ప్రస్తుతం ‘లెనిన్’ మూవీ ప్రమోషన్స్‌లో ఉన్న ఆమె.. తాజాగా ఓ మలయాళ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో ఓ సర్వైవల్ థ్రిల్లర్ రూపొందుతోంది. లాల్ కెరీర్‌లో ఇది 367వ చిత్రం.
ఈ సినిమాతోనే భాగ్యశ్రీ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. రష్యాతోఉక్రెయిన్ యుద్ధంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన సీక్రెట్ మిషన్ ఆపరేషన్ గంగ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ దేశభక్తి సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కీలకపాత్రను పోషించనుందట.
ఆగస్టు ఫస్ట్ వీక్‌లో జార్జియాలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కమల్ హాసన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘సియోన్’లో ఆమె శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తోంది. ఇక అఖిల్‌కు జంటగా భాగ్యశ్రీ నటించిన ‘లెనిన్’ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
