బిజినేపల్లి: నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు అమెరికాలో అనారోగ్య కారణాలతో చనిపోయిన ఘటన విషాదం నింపింది. బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన సాయి అరుణ్ రెడ్డి (26) 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
కొద్ది నెలలుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. చికిత్స కోసం భారత్‌కు రావాలనుకున్నా, తిరిగి అమెరికా వెళ్లడంపై వీసా ఇబ్బందులు వస్తాయని ఆందోళనలతో అక్కడే ఉన్నట్లు స్నేహితుల వెల్లడించారు.
అనారోగ్యం తీవ్రం కావడంతో సోమవారం సాయంత్రం అమెరికాలో ఉంటున్న ఇంట్లోనే అరుణ్ మృతి చెందాడు. అమెరికాలోని తెలుగు స్నేహితులు చందాలు సేకరించి మృతదేహం తరలింపు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మృతదేహం గంగారం గ్రామానికి చేరుకోవడానికి మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అరుణ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
