
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The Rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అప్డేట్ రాబోతోందని నిన్నటి నుంచి సోషల్ మీడియాకి హత్తుకుపోయారు.ఇక ఆ సమయం వచ్చేసింది.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా (ఏప్రిల్ 8న)టీజర్ రాబోతున్నట్లు ప్రకటించారు. పుష్పరాజ్ రెట్టింపు అగ్నితో వస్తున్నాడు..కాసుకోండి. 2024 ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు. దీంతో పుష్ప ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు.
ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ అల్లు అర్జున్ కాళ్లను మాత్రమే చూపిస్తూ..కింద అంతా కుంకుమ పరిచినట్లు కనిపిస్తూ ఉండగా..ఇందులో పుష్పరాజ్ కాళ్లకు గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు.గతంలో లేడీ గెటప్ లో అల్లు అర్జున్ ఉన్న ఒక పోస్టర్ ఎంతో వైరల్ అయింది.
ఇక నుంచి పుష్ప2 రిలీజ్ వరకు..పుష్పగాడి మాస్ జాతరలోని ఎక్సయిటింగ్ అప్డేట్స్ తో అల్లు ఫ్యాన్స్ కి పండుగనే చెప్పుకోవాలి.
Let the #PushpaMassJaathara begin ?
— Pushpa (@PushpaMovie) April 2, 2024
??? ???? ??????? #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️?❤️?
He is coming with double the fire ??#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/gCPRAxqoPh
పుష్ప ఫస్ట్ పార్ట్లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుండా..సుకుమార్ క్రియేటివ్ ఐడియాస్..అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంచనాల దృష్ట్యా..సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి తగ్గేదేలే అన్నట్టు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఈ సీక్వెల్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఏదేమైనా రూ.1000 కోట్లకు టార్గెట్ తో బరిలో నిలిచింది.