అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్

అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క‌లయిక‌లో రూపుదిద్దకుంటున్న సినిమా పుష్ప. మైత్రీ మూవీమేక‌ర్స్‌, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. బుధ‌వారం బ‌న్నీ బర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని సినిమా టీం విడుద‌ల చేసింది.

ఈ సినిమాను తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బన్నీ, సుకుమార్‌ల క‌ల‌యిక‌లో ఆర్య‌, ఆర్య -2 సినిమాలొచ్చాయి. లేటెస్టుగా వ‌స్తున్న పుష్ప సినిమా మూడ‌వ‌ది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తర్వాత ఆస్థాయి సినిమా చేయాల‌ని బ‌న్నీ ప‌ట్టుబ‌ట్ట‌డంతో తెర‌పైకొచ్చిన స్క్రిప్ట్ ఇది.

గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టైటిల్‌ని బ‌ట్టి చూస్తే ఇందులో అర్ధమవుతోంది. గుబురు గ‌డ్డం, గుబురు మీసం జుల‌పాల జుట్టు, 90వ ద‌శ‌కం కాలం నాటి ష‌ర్ట్ డిజైన్‌ను చూస్తుంటే ఇదొక పిరియాడిక్ స్టోరీలా తెలుస్తోంది.  సినిమాలో బ‌న్నీ పాత్ర పేరు పుష్ప‌రాజ్‌. అందుకే ఈ చిత్రానికి `పుష్ప‌`అని పెట్టారు.