రెండు వేర్వేరు టైమ్‌‌ లైన్స్‌‌ లో.. రెండు భాగాలుగా.. అల్లు అర్జున్ రాకా..

రెండు వేర్వేరు టైమ్‌‌ లైన్స్‌‌ లో.. రెండు భాగాలుగా.. అల్లు అర్జున్ రాకా..

అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘రాకా’.  శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో క్రేజీ అప్‌‌డేట్‌‌ వినిపిస్తోంది. దీనిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌‌ భావిస్తున్నట్టు సమాచారం. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌‌తో, రెండు వేర్వేరు టైమ్‌‌లైన్స్‌‌లో ఈ రెండు భాగాలు రూపొందిస్తున్నట్లు టాక్.  గిరిజన, పురాణ, వేద కాలం నాటి నేపథ్యం ఒకటి కాగా, మరొకటి ప్రస్తుత కాలానికి చెందినది. 

చారిత్రక నేపథ్యం ఉన్న కథలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కనిపిస్తారని, ప్రజెంట్‌‌ టైమ్‌‌లైన్‌‌లో జరిగే కథలో మృణాల్ ఠాకూర్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.  

అంతేకాదు..  బాలీవుడ్‌‌ స్టార్‌‌‌‌ షారుక్ ఖాన్‌‌ ఇందులో క్యామియో రోల్‌‌లో కనిపించబోతున్నారట. తనకు ‘జవాన్‌‌’ లాంటి హిట్‌‌ ఇచ్చిన అట్లీతో షారుక్​కు ఉన్న సాన్నిహిత్యంతో ఆయన ఈ పాత్రకు అంగీకరించినట్టు సమాచారం.  సాయి అభ్యంకర్‌‌‌‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్‌‌ బ్యానర్‌‌‌‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.