
వైఎస్ఆర్సీపీ తరపున నంధ్యాల శాసనసభ స్థానం నుంచి బరిలో ఉన్న శిల్పా రవి రెడ్డికి తన మద్దతును ప్రకటించారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఇందుకుగాను ట్విటర్ లో లెటర్ ను రిలీజ్ చేశారు.‘ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్న నా ఫ్రెండ్ శిల్పా రవి రెడ్డికి అభినందనలు. రవి సేవలు ప్రజలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మా రాజకీయ దారులు వేరైనా.. మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. రవిని ప్రజా సేవలో చూడటం గర్వంగా ఉంది. చాలా సంవత్సరాలుగా రవి నాకు మంచి స్నేహితుడు. అతను విజయం సాధించాలని కోరుకుంటున్న’ అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
BEST WISHES pic.twitter.com/65HonIrB3c
— Allu Arjun (@alluarjun) April 6, 2019