కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ‘అల్లు సినిమాస్’ పేరుతో నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ ప్రారంభించారు. వరల్డ్‌క్లాస్ టెక్నాలజీతో ప్రీమియం లార్జ్ స్ర్కీన్ ఫార్మాట్‌ను ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది.
ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మీడియా మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో ఆడియెన్స్ సినిమాను చూడటమే కాదు.. దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకుంటున్నారు. దాని కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ ఐడియాతోనే లార్జ్ ఫార్మాట్‌లో ‘అల్లు సినిమాస్’ నిర్మించాం.
మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, డాల్బీలో చాలా కొత్తగా కనిపిస్తూ, వినిపిస్తుంది. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్‌లెట్లను బయటకు కనిపించకుండా అమర్చాం. జర్మనీ టీం ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఒకేసారి 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా ఇది నిలిచింది’ అని అన్నారు.
