కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీనియర్ నేత, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్ రెడ్డి కోరారు. ఆదివారం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో వాకర్స్‌ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ సిటీలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందన్నారు. ఉచిత కరెంటు, సన్న బియ్యం, రైతులకు రైతుబంధు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని వివరించారు.
