గ్రేటర్​ సీపీల చేతిలో  మరో 13 మంది పోలీసుల చిట్టా

గ్రేటర్​ సీపీల చేతిలో  మరో 13 మంది పోలీసుల చిట్టా

తప్పు చేసినట్లు తేలితే సస్పెన్షన్
బాధితుల కంప్లయింట్ల ఆధారంగా ఎస్​బీ, ఇంటెలిజెన్స్​తో విచారణ

 

హైదరాబాద్,వెలుగు: మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు,  మల్కాజిగిరి సీసీఎస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఐ ధరావత్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌పై నమోదైన అత్యాచారం,కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ కేసులు డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో  కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ అని చెప్పుకుంటున్నప్పటికీ అది ఆచరణలో అమలు కావడం లేదు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులపై వస్తున్న అవినీతి ఆరోపణలే ఇందుకు నిదర్శనంగా మారాయి. పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా కొందరు పోలీసులు చేస్తున్న సివిల్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లు,అవినీతి, అక్రమాలు నిజాయతీగా పనిచేస్తున్న వారికి మచ్చ తెస్తున్నాయి. దీంతో  గ్రేటర్​లోని పోలీసులు, సిబ్బం
దిపై 3 కమిషనరేట్ల సీపీలు నిఘా పెట్టారు.  

అడ్డదారుల్లో నేరస్తులకు సహకరిస్తూ.. 

టెక్నాలజీ పరంగా, ఆర్థికంగా డిపార్ట్ మెంట్‌‌‌‌‌‌‌‌ లో ఎన్ని మార్పులు వచ్చినా పోలీసులు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఓ వైపు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, నేరస్తులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు డిపార్ట్​మెంట్​కు మచ్చ తీసుకొస్తున్నాయని పోలీస్ బాస్​లు గుర్తించారు. అన్ని విభాగాల వారీగా అవినీతి అధికారుల చిట్టా రాబడుతున్నారు.స్పెషల్‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌, ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌తో రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. డీసీపీ స్థాయి అధికారితో అంతర్గత విచారణ జరిపిస్తున్నారు. బాధ్యులైన వారిని హెడ్డాఫీసుకు అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లేదా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. సస్పెన్షన్స్, అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌, చార్జిమెమోలు ఇలా ఎలాంటి చర్యలు తీసుకున్నా సిబ్బందిలో మార్పు రాకపోవడంతో మరింత సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు 
సిద్ధమవుతున్నారు.

శివారు ప్రాంతాల్లో మీడియేటర్లతో దందా

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో సుమారు 13 మంది పోలీసులపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీపీలు గుర్తించారు. శివారు ప్రాంతాల్లోని పీఎస్‌‌‌‌‌‌‌‌లలో మీడియేటర్లతో సివిల్‌‌‌‌‌‌‌‌ వివాదాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. సంబంధిత ఏరియాల్లోని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో వివరాలు రాబడుతున్నారు. సోషల్ మీడియ,ఫేస్ బుక్, ట్విట్టర్,ఈ –-మెయిల్​కు  వస్తున్న కంప్లయింట్లను సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకుంటున్నారు. ఆన్ లైన్‌‌‌‌‌‌‌‌లో వచ్చే కంప్లయింట్​ చేసే వాళ్లకు ఎకనాలెడ్జ్ మెంట్ ఇచ్చి కేసు దర్యాప్తు చేయిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు, మీడియేటర్లతో సివిల్‌‌‌‌‌‌‌‌ సెటిల్ మెంట్లు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో కూడా స్థానిక నేతలు ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం.  ఇలాంటి వ్యవహరాలకు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు పీఎస్​కు వచ్చే బాధితులు, నిందితులు, ఇతరుల డేటాను కలెక్ట్ చేస్తున్నారు. కీలకమైన కేసుల్లో స్థానిక సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఎస్​బీ సిబ్బందిని సీపీలు ఆదేశించారు.రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వివాదాలు,హత్యలు, కిడ్నాప్‌‌‌‌‌‌‌‌, బెదిరింపు కేసులపై  స్పెషల్ ఫోకస్ పెట్టారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా,అవినీతి అక్రమాలకు పాల్పడినా సంబంధిత డీసీపీని బాధ్యుడిని చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

ఇటీవల జరిగిన తీవ్రమైన నేరాల్లో పోలీసులపై తీసుకున్న చర్యలు అత్యాచారం కేసులో మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లి మాజీ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె. నాగేశ్వరరావు, మల్కాజిగిరి సీసీఎస్‌‌‌‌‌‌‌‌ ఎస్ఐ ధరావత్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్ సస్పెన్షన్, మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రేప్‌‌‌‌‌‌‌‌  కేసులో నిందితులకు సపోర్టు చేసిన చందానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎస్ఐ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌‌‌‌‌, సివిల్‌‌‌‌‌‌‌‌ వివాదాల కేసులో తలదూర్చిన మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మాజీ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎస్ఐ అప్పారావు, సుల్తాన్ బజార్ మాజీ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌, టైర్ల చోరీ కేసులో నిందితుడైన వ్యక్తి డెబిట్‌‌‌‌‌‌‌‌కార్డుతో రూ.5 లక్షలు విత్ డ్రా చేసిన ఎల్ బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీసీఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ  ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవేందర్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్
ఇబ్రహీంపట్నంలో జరిగిన రియల్టర్ల హత్య కేసులో డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెన్షన్.